నిర్మాత కక్కుర్తి.. విజయ్‌ దేవరకొండ సారీ చెప్పాల్సి వచ్చింది

విజయ్‌ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘నోటా’.భారీ అంచనాల నడుమ అక్టోబర్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

తాజాగా విజయవాడలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించడం జరిగింది.సహయంగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా హైదరాబాద్‌లో జరుగుతూ ఉంటాయి.

కాని సినిమా పబ్లిసిటీ కోసం హైదరాబాద్‌తో పాటు విజయవాడలో కూడా నిర్వహించారు.

Advertisement

విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం కోసం ఒక చిన్న హాల్‌ను తీసుకోవడం జరిగింది.కాని అనూహ్యంగా పెద్ద ఎత్తున ఆడియన్స్‌ వచ్చారు.దాదాపుగా సగానికి పైగా ప్రేక్షకులు బయటనే ఉండాల్సి వచ్చింది.

గీత గోవిందం చిత్రంతో విజయ్‌ దేవరకొండకు భారీ ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరింది.ఆ విషయాన్ని నిర్మాత పట్టించుకోలేదో లేకా మరేం అనుకున్నాడో కాని నోటా విజయవాడ ప్రీ రిలీజ్‌ వేడుకకు సరైన ఏర్పాట్లు చేయలేదు.

దాంతో విజయ్‌ అభిమానులు చాలా నిరుత్సాహం వ్యక్తం చేశారు.

సగానికి పైగా ప్రేక్షకులు బయట ఉండటంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు.కొందరు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దాంతో విజయ్‌ దేవరకొండ బయటకు రావాలంటూ కొందరు నినాదాలు చేశారు.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!

మొత్తానికి విజయవాడలో నోటా వేడుక రసాబాసాగా మారింది.అభిమానులను అదుపులో ఉంచేందుకు పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పినట్లుగా కార్యక్రమంకు వెళ్లిన వారు అంటున్నారు.

Advertisement

కార్యక్రమ నిర్వాహకులు చేసిన పొరపాటుకు విజయ్‌ దేవరకొండ క్షమాపణలు చెప్పాడు.ఇలా జరుగుతుందని తాను భావించలేదని, బయట ఉన్న ప్రతి ఒక్కరికి సారీ అంటూ విజయ్‌ దేవరకొండ అన్నాడు.మళ్లీ త్వరలోనే విజయవాడకు వస్తాను అని, తప్పకుండా అప్పుడు మీ అందరిని కలుస్తాను అంటూ విజయ్‌ హామీ ఇచ్చాడు.

నోటా చిత్రంకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించగా, తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన విషయం తెల్సిందే.

తాజా వార్తలు