Vijay Devarakonda Liger : మీ ప్రేమ వల్ల అప్పుడప్పుడూ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు.

విజయ్ దేవరకొండ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ బీబత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.ఇకపోతే ఇటీవలే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇది ఇలా ఉంటే లైగర్ సినిమా లావాదేవీల విషయంలో మనీ లాండరింగ్ ఆరోపణలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

దాంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.తాజాగా విజయ్ దేవరకొండ ఈడీ అధికారుల ముందుకు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే.

Advertisement
Vijay Devarakonda Made Interesting Comments After The Ed Investigation , Vijay D

ఈ విచారణలో భాగంగా అధికారులు దాదాపుగా 12 గంటలపాటు విజయ్ ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ.

అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు.ఆ ప్రశ్నలకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చాను.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.ఇదే నేను చెప్పగలను అంతకంటే నేనేమైనా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు.

Vijay Devarakonda Made Interesting Comments After The Ed Investigation , Vijay D

అలిగేషన్స్ ఏమీ లేవు కొన్ని క్లారిఫికేషన్ మాత్రమే మీరు ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి ఆ ప్రేమతో వచ్చే పాపులారిటి వల్ల అప్పుడప్పుడు ఇలా కొన్ని ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి.అందులో ఇది కూడా ఒకటి అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.ఇది కూడా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చాడు విజయ్.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

కాగా ఇప్పటికే లైగర్ టీం అయిన దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిని ఇప్పటికే ఈడి అధికారులు విచారించిన విషయం తెలిసిందే.ఈ విచారణలో భాగంగా లైగర్ మూవీ పెట్టుబడులో హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు ఈడి అధికారులు.

Advertisement

దుబాయ్ కి డబ్బులు పంపి తిరిగి అక్కడినుంచి సినిమాలో ఇన్వెస్ట్ చేసినట్లుగా తేల్చారు.అంతేకాకుండా ఇందులో పొలిటికల్ లీడర్ హ్యాండ్ కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది.

తాజా వార్తలు