టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం స్క్రిప్టు పనులు కూడా పూర్తి చేశాడు పూరీ.
అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సార్‌గా కనిపించనున్నాడు.ఫైటర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌లో మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నాడు.
ఈ ట్రెయినింగ్‌లో భాగంగా ఖచ్చితమైన డైట్‌ను కూడా ఫాలో అవుతున్నాడట రౌడీ హీరో.అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించనున్న పూరీ, ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఒప్పించే పనిలో పడ్డాడట.
విజయ్ కెరీర్‌కు ఫైటర్ చిత్రం బూస్ట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు సినీ జనం.ఇక పూరీ ఛార్మీతో కలిసి ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్‌తో కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
మరి ఫైటర్ అవతారంలో రౌడీ హీరో ఎలా రెచ్చిపోతాడో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
Home English News TeluguStop Exclusive Stories Flash/Breaking News Trending News Political Movie Health Tips Crime News Movie Reviews NRI News Viral Videos Bhakthi/Devotional Press Releases Viral Stories Quotes Photo Talks Baby Boy NamesBaby Girl Names Celebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.com Ph No : 999-279-9973
About Us!
About Us Jobs Advertising DMCA / Removal Terms of Use Privacy Policy