విజయ్‌ దేవరకొండకు వింత పరిస్థితి

డియర్‌ కామ్రేడ్‌కు ముందు వరకు విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ వేరు.

ఆయనతో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ కూడా సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించాడు అంటే ఆయన ఏ స్థాయిలో క్రేజ్‌ను దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.గతంలో విజయ్‌ డేట్ల కోసం వెంట తిరిగిన పలువురు నిర్మాతలు ఇప్పుడు విజయ్‌తో సినిమా అంటేనే కనిపించకుండా పోతున్నారట.

ఇటీవల వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో విజయ్‌ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.వారం రోజులు కూడా థియేటర్లలో కనిపించలేదు.

డిజాస్టర్‌గా నిలిచింది.డియర్‌ కామ్రేడ్‌ దెబ్బ మానకుండానే ఈ చిత్రం దెబ్బ కొట్టడంతో విజయ్‌ దేవరకొండ తేరుకోలేక పోతున్నాడు.

Advertisement

అత్యంత దారుణ పరిస్థితిని విజయ్‌ ఎదుర్కొంటున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.ఇటీవల ఒక నిర్మాతతో విజయ్‌ దేవరకొండ మాట్లాడాడట.

ఆ నిర్మాతను సినిమా చేద్దామని అడిగాడట.

ఆ నిర్మాత గతంలో విజయ్‌ దేవరకొండ డేట్ల కోసం బ్లాంక్‌ చెక్‌ పట్టుకుని తిరిగాడట.కాని ఇప్పుడు మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.నీతో సినిమా చేసే ఆసక్తి లేదు అంటూ విజయ్‌ తో ఆ నిర్మాత డైరెక్ట్‌గా అనేశాడట.

పది కోట్లు అంటే ఇచ్చేందుకు ముందుకు వచ్చిన నిర్మాతలు ఇప్పుడు రెండు మూడు కోట్లు కూడా ఇవ్వాలనుకోవడం లేదట.మొత్తానికి విజయ్‌ దేవరకొండ ఈ వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

పిస్తా కాస్త ఎక్కువగా తింటున్నారా..? కాస్త జాగ్రత్త సుమా..!
Advertisement