గల్లీ బాయ్ గా మారుతా అంటున్న రౌడీ హీరో

టాలీవుడ్ లో రౌడీ హీరో అందరూ వెంటనే చెప్పే పేరు విజయ్ దేవరకొండ.

ఈ కుర్ర హీరో టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

తెలుగ ఇండస్ట్రీలో ఎ హీరోకి రానటువంటి క్రేజ్ విజయ్ దేవరకొండ్డ కి కేవలం నాలుగు హిట్స్ తో వచ్చేసింది.ఇక ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ చేతిలో మరో అరడజను ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తరహా క్రేజ్ తో దూసుకుపోతున్న హీరో రణవీర్ సింగ్.ఈ కుర్ర హీరో తాజాగా గల్లీ బాయ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.

మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు గల్లీ బాయ్ రీమేక్ పై సౌత్ దర్శక, నిర్మాతల కన్ను పడింది.

Advertisement
Vijay Devarakonda Concentrate To Remake On Gully Boy Movie-గల్లీ బ�
Vijay Devarakonda Concentrate To Remake On Gully Boy Movie

ఈ స్టొరీని విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యి అతనిని సంప్రదించడం జరిగిందని టాక్.ఇక విజయ్ కూడా ఈ సినిమాపై పోజిటివ్ గానే ఉన్నాడని సమాచారం వినిపిస్తుంది.మరి గల్లీ బాయ్ రీమేక్ లో విజయ్ ఎంత వరకు నటిస్తున్నాడు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు