రౌడీ స్టార్‌ తమ్ముడి జోరు మామూలుగా లేదుగా... ముచ్చటగా మూడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడి ఆనంద్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు.

ఆనంద్ దేవరకొండ మెల్ల మెల్లగా కెరియర్ లో సెటిల్ అయ్యే విధంగా సినిమాలను చేస్తున్నాడు.

ఈయన మొదటి సినిమా దొరసాని కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.అయినా కూడా ఆ సినిమా నటుడి గా ఆనంద్ దేవరకొండ కు మంచి పేరు తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ నుండి మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా వచ్చింది.ఆ సినిమా లో ఆనంద్ దేవరకొండ నటన చాలా నాచురల్ గా ఉంది అంటూ కామెంట్స్ దక్కించుకుంది.

కనుక అప్పటి నుంచి ఆనంద్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఆఫర్లు వస్తున్నాయి.

Vijay Devarakonda Brother Anand Devarakonda New Movie Gam Gam Ganesha , Anand De
Advertisement
Vijay Devarakonda Brother Anand Devarakonda New Movie Gam Gam Ganesha , Anand De

ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ కూడా తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో సినిమాలు నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు.ఇప్పటికే విజయ్ దేవరకొండ నిర్మించిన పుష్పక విమానం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.ఆనంద్ దేవరకొండ కు పుష్పక విమానం కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చి పెట్టింది.

అన్నదమ్ముల కాంబినేషన్ కమర్షియల్ సక్సెస్ లభించింది.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హైవే మరియు బేబీ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఈ సమయంలోనే మరో సినిమా ను కూడా ఆనంద్ దేవరకొండ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వం లో గం గం గణేశా అనే సినిమా తెరకెక్కబోతుంది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఈ సినిమా ను కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి లు నిర్మిస్తున్నారు.ఆనంద్ దేవరకొండ ఒకేసారి మూడు సినిమాలను చేస్తూ ఉన్నాడు.

Advertisement

మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.గత మూడేళ్లుగా రౌడీ స్టార్‌ నుండి వచ్చిన సినిమా ఒకే ఒక్కటి.

కాని ఆనంద్ దేవరకొండ మాత్రం అయిదు సినిమాలను చేశాడు.తమ్ముడి జోరు మామూలుగా లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు