విజయ్ 'లియో' షూట్ పై లేటెస్ట్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఇక్కడేనట!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.

ఈయన నటించిన గత సినిమా వారిసుతో తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.

వారసుడు అనే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అందుకుంది.ఈ సినిమాను మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించాడు.

మరి సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా విజయ్ కు మంచి విజయం అందించింది.ఈ సినిమా రిలీజ్ అవ్వడంతోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా మొదలెట్టాడు.

మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో విజయ్ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టారు.ఈ సినిమా టైటిల్ ఎప్పుడో ప్రకటించి సంచలనం క్రియేట్ చేసాడు.

Advertisement
Vijay And Lokesh Kanagaraj LEO Movie Update Details, Thalapathy 67, Thalapathy V

ఈ అవైటెడ్ సినిమాకు లియో (LEO) అనే టైటిల్ ను ప్రకటించారు.

Vijay And Lokesh Kanagaraj Leo Movie Update Details, Thalapathy 67, Thalapathy V

ఈ సినిమా లాంఛ్ చేయగానే ఫస్ట్ షెడ్యూల్ ను కాశ్మీర్ లో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేసారు.పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూట్ ను మేకర్స్ ముగిస్తున్నారు.ఇక ఇప్పుడు మరో కీలక షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది.

నెక్స్ట్ షెడ్యూల్ ను మార్చి 29 నుండి చెన్నై లో స్టార్ట్ చేయనున్నారట.చెన్నైలో స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు జరగనున్నాయట.

Vijay And Lokesh Kanagaraj Leo Movie Update Details, Thalapathy 67, Thalapathy V

మరి ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ లేదా మే నాటికీ మొత్తం కంప్లీట్ చేసేసి అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.

Advertisement

తాజా వార్తలు