ఈ రోజుల్లో కామాంధులు పట్టపగలే ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షాక్‌లు ఇస్తున్నారు.ఒక్కోసారి ఆడవారు ఎదురు తిరిగి వీరికి దేహాశుద్ధి చేస్తున్నారు.
ఇటీవల కేరళలోని త్రిస్సూర్ సిటీలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.ఒక వృద్ధుడు రిటైల్ షాప్ నడుపుతున్నాడు.
ఆ షాప్‌కి వచ్చిన ఓ యువతి( Young woman )ని ఈ వృద్ధుడు అసభ్యంగా పట్టుకున్నాడు.దాంతో కోపోద్రిక్తురాలైన సదరు యువతి అతడిని బహిరంగంగా చెప్పుతో కొట్టింది.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన త్రిసూర్‌లోని మార్కెట్ ప్రాంతంలో, మెడికల్ కాలేజీకి సమీపంలో చోటు చేసుకుంది.ఈ ఘటనను కొందరు తమ ఫోన్ కెమెరాల్లో రికార్డు చేశారు.వాటిలో ఒక వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమై వైరల్ అవుతుంది.
ఈ ఘటనకు దారి తీసిన కారణాల గురించి కూడా వీడియో షేర్ చేసిన వారు వెల్లడించారు.ఆ వివరాల ప్రకారం అలీ( Ali ) అనే వృద్ధుడు కిరాణా దుకాణం నడుపుతున్నాడు.
బాధిత యువతి సరుకులు కొనుగోలు చేసేందుకు అతడి షాప్ కి వెళ్ళింది.ఆ సమయంలో ఈ వృద్ధుడు యువతి బ్రెస్ట్స్ పట్టుకున్నాడట.
దీంతో కోపంతో ఊగిపోతూ తనతో అనుచితంగా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం అంటూ తిట్టేసింది.
అలా తిడుతూనే అలీని చెప్పులతో చెంప పగల కొట్టింది.అయితే వృద్ధుడు ప్రతిఘటించకుండా క్షమాపణలు చెప్పాడు.అంతేకాకుండా తనపై పోలీస్ కేసు ( Police )పెట్టొద్దని వారిని వేడుకున్నాడు.
అక్కడే ఉన్న మరొక మహిళ, వృద్ధుడు ఇంతకుముందు కూడా ఆడవారితో ఇలానే అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇంకా రెండు దెబ్బలు వేయాలంటూ బాధిత యువతిని ఎంకరేజ్ చేసింది.
అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy