వివేకా హత్య జరిగిన రోజుపై ఎంపీ అవినాశ్ రెడ్డి వీడియో రిలీజ్

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగిందోనన్న అంశంపై కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వీడియో విడుదల చేశారు.

వివేకా హత్య రోజు తనకు ఉదయం ఆరున్నరకు కాల్ వచ్చిందని తెలిపారు.

ఆ రోజు జమ్మల మడుగులో వైసీపీలోకి జాయినింగ్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు.పులివెందుల రింగ్ రోడ్ లో ఉన్న సమయంలో శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేశాడని, వివేకా బావ ఇంటికి అర్జంటుగా వెళ్లమని చెప్పారన్నారు.

ఎందుకని అడుగగా బావ చనిపోయారనడంతో వెంటనే ఇంటికి వెళ్లామని తెలిపారు.వివేకా మృతదేహం బాత్ రూమ్ లో ఉందని పీఏ కృష్ణారెడ్డి చెప్పాడన్నారు.

బెడ్ రూమ్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని పీఏను అడిగితే లేదన్నారని వెల్లడించారు.వివేకా రూమ్ లో లెటర్, ఫోన్ ఉన్నాయన్న విషయాన్ని పీఏ ద్వారా తెలుసుకున్న ఆయన అల్లుడు రాజశేఖర్ వాటిని దాయమని చెప్పారని పేర్కొన్నారు.

Advertisement

దీనిపై సునీతారెడ్డి ఓసారి ఒక విధంగా తర్వాత మరో విధంగా సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు.లెటర్ దాచిపెట్టడం ఎవరిని కాపాడాటం కోసమని ప్రశ్నించిన అవినాశ్ రెడ్డి.

తనను కావాలనే కుట్ర పూరితంగా ఈ హత్య కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు