వీడియో: కారు విండోలో చిక్కుకున్న చిన్నారి.. చాకచక్యంగా కాపాడిన వ్యక్తి..

కారు( Car ) సురక్షితంగా కనిపించినా అది చిన్నారులకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు.

ఇప్పటికే డోర్ లాక్ కావడం వంటి సమస్యల వల్ల ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

కారు విండోస్‌ కూడా పిల్లల పాలిట మృత్యువుగా మారుతున్నాయి.తాజాగా కూడా ఓ చిన్నారి హెయిర్ లేదా తల కారు విండోలో ఇరుక్కుంది.

అయితే సమయానికి ఓ వ్యక్తి వచ్చి ఆమెను కాపాడాడు.

కారు కిటికీలోంచి ఆ వ్యక్తి చిన్నారిని రక్షించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.వీడియోలో సదరు వ్యక్తి కారు దగ్గరకు పరిగెడుతూ కిటికీని పిడికిలితో పగలగొట్టడం మనం చూడవచ్చు.చిన్నారి తల కిటికీలో ఇరుక్కుపోయింది, కానీ ఎలా లేదా ఎందుకు అలా ఇరుక్కుపోయిందో అర్థం కాలేదు.

Advertisement

బహుశా కారు ఫెయిల్ అయి, కిటికీలోని గ్లాస్ కిందికి దిగి ఉండకపోవచ్చు.ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్( Twitter ) ఖాతా అయిన సీసీటీవీ ఇడియట్స్ షేర్ చేసింది.

దీనికి 4 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

వీడియోకు "పిల్లవాడు పైకి వెళుతున్న కిటికీలో ఇరుక్కుపోయాడు." అని ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.

పిల్లవాడి పక్కన ఉన్న మహిళ కిటికీ ఎందుకు దించలేదని నెటిజన్లు అడిగారు.ఆ మహిళ బ్యాడ్ పేరెంట్ అని వారు ఆగ్రహం వెళ్లగక్కారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

ఆమె పిల్లవాడిని జాగ్రత్తగా చూడలేదని అన్నారు.పిల్లవాడిని గాయపరచకుండా కిటికీ( Car window )ని ఆపడానికి కారులో భద్రతా ఫీచర్ ఉందా అని కూడా వారు అడిగారు.

Advertisement

చిన్నారిని రక్షించిన వ్యక్తిని కొందరు ప్రశంసించారు.అతను హీరో అని వారు చెప్పారు.

అతను వేగంగా యాక్ట్ చేశాడని, మంచి అలర్ట్ నెస్ కలిగి ఉన్నాడని వారు చెప్పారు.కిటికీలు పగలడం కష్టం అయినా సదరు వ్యక్తి ఆ పని చేయడం పిల్లవాడు అదృష్టవంతుడని వారు చెప్పారు.

ఈ భయానక పరిస్థితి ఎవరికీ రాకూడదని అన్నారు.

తాజా వార్తలు