మనతో మన రజినమ్మ : అప్పుడే మొదలెట్టేసిన మంత్రి గారు 

రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ వైసిపి( YCP )కచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగురువేయాలనే పట్టుదలతో ఆ పార్టీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఉన్నారు.

దీనికి తగ్గట్లుగానే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.

చిలకలూరిపేట నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం ఇస్తున్న విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ స్థానాన్ని మార్పు చేర్పుల్లో భాగంగా జగన్ కేటాయించారు.దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగానే రజిని ప్రారంభించారు.

ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే విడుదల రజిని( Rajini Vidadala ) నియోజకవర్గమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకున్నారు.ఇప్పటికే అక్కడ పార్టీ ఆఫీసును కూడా రజిని ప్రారంభించారు.

Vidadala Rajini Started Manato Mana Rajinamma Program Details, , Tdp, Janase

 మనతో మన రజినమ్మ పేరుతో ఆమె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు .ఈ మధ్యకాలంలో పార్టీ ఆఫీసు పైన టిడిపి కార్యకర్తలు దాడులు చేసి అద్దాలు ధ్వంసం చేసిన ఘటన పై రజిని తీవ్రంగానే స్పందించారు.రాజకీయంగా అన్నిటిని తట్టుకుంటానని,  వాటిపై పోరాటం చేస్తానని రజిని చెబుతున్నారు.

Advertisement
Vidadala Rajini Started Manato Mana Rajinamma Program Details, , TDP, Janase

  నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే విధంగా రజిని ప్లాన్ చేసుకుంటున్నారు.ఇప్పటికే భారీ కాన్వాయ్ తో ర్యాలీ సైతం నిర్వహించారు.ప్రజలను పలకరిస్తూ పాదయాత్ర చేశారు.

ముత్యాలు రెడ్డి నగర్ లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేసినట్లుగా విడుదల రజని తెలిపారు.

Vidadala Rajini Started Manato Mana Rajinamma Program Details, , Tdp, Janase

ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని,  ముత్యాలు రెడ్డి నగర్ లో సంక్షేమ కార్యక్రమాలు ద్వారా 16 కోట్ల రూపాయల మేర ప్రజలకు లబ్ధి జరిగిందని రజిని చెప్పారు.నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించి తన విజయానికి డోకా లేకుండా చూసుకోవాలని ఆమె  భావిస్తున్నారు.అంతేకాకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి హామీలను కూడా ఇచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా, తన గెలుపుకు డోకా లేకుండా చేసుకునే విధంగా రజిని ప్లాన్ చేసుకుంటున్నారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు