మహేష్ అన్నగా వేణు..!

ఒకప్పుడు హీరోగా చేసిన తొట్టెంపూడి వేణు కెరియర్ కి అనుకోకుండానే గ్యాప్ ఇచ్చాడు.

అయితే రీసెంట్ గా మాస్ మహరాజ్ రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

సినిమాలో వేణు పోలీస్ పాత్రలో నటించాడు.ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా మళ్లీ వేణుని ఆన్ స్క్రీన్ చూసి ఆడియెన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

ఇక ఈ సినిమా తర్వాత వేణుకి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.ఈసారి మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో వేణు ఛాన్స్ అందుకున్నారట.

సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కనుంది.ఈ సినిమాలో మహేష్ అన్న పాత్రలో వేణు నటిస్తారని తెలుస్తుంది.

Advertisement

వేణు హీరోగా చేసిన చిరునవ్వుతో సినిమాకు త్రివిక్రం రైటర్ గా పనిచేశారు.అప్పుడు రైటర్ గా చేసి వేణుతో మెప్పించిన త్రివిక్రం ఈసారి ఆయన డైరక్షన్ లో వేణుకి ఒక మంచి పాత్ర ఇస్తున్నారట.

మహేష్ అన్నగా వేణు ఎలా మెప్పిస్తారో చూడాలి. రీ ఎంట్రీ తర్వాత ఇక మీద సపోర్టింగ్ యాక్టర్ గా కొనసాగుతానని అంటున్నారు వేణు.

ఆయన చేస్తా అనాలే కానీ మంచి ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు