ఆ కారణంతోనే మెగా మనవరాలు జాతకం బయట పెట్టాను.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

ఇటీవల కాలంలో వేణు స్వామి( Venu Swamy ) ఎంతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఈయన సెలెబ్రిటీల జాతకాలని చెబుతూ తరచు వార్తలలో నిలుస్తున్నారు.

ఇలా సెలబ్రిటీల జాతకాలను చెప్పడంతో ఒక్కసారిగా వారి అభిమానుల ఆగ్రహానికి వేణుస్వామి గురి అవుతున్నారు.ఇలా వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాలను కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ప్రభాస్ ( Prabhas ) జాతకం చెబుతూ వార్తలలో నిలుస్తున్నటువంటి ఈయనను ప్రభాస్ అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.ఇలా ప్రభాస్ గురించి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరో హీరోయిన్ల జాతకాలను చెబుతున్న ఈయన మెగా మనవరాలు క్లిన్ కారా ( Klin Kaara ) జాతకం గురించి కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈయన మెగా మనవరాలు జాతకాన్ని చెప్పడం చాలా మంది ఈయన పట్ల విమర్శలు చేశారు.ఇంత చిన్న పిల్ల పుట్టగానే తన జాతకం ఎలా చెబుతావు చిన్న పిల్లల జాతకాలు చెప్పకూడదని తెలీదా అంటూ భారీ స్థాయిలో విమర్శలు కురిపించారు.

Advertisement
Venu Swamy Comments About Klin Kaara ,Venu Swamy,Klin Kaara,Prabhas, Tollywood -

ఈ విధంగా వేణు స్వామి క్లిన్ కారా జాతకం గురించి చెప్పిన సమయంలో భారీ స్థాయిలు విమర్శలు వచ్చాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎందుకు మెగా మనవరాలు జాతకం బయట పెట్టారనే విషయాన్ని కూడా వెల్లడించారు.

క్లిన్ కారా జాతకం గురించి చెప్పడం వెనక కారణమేంటనే ప్రశ్న యాంకర్ వేయాగా ఆ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ.

Venu Swamy Comments About Klin Kaara ,venu Swamy,klin Kaara,prabhas, Tollywood

కేవలం బాలారిష్టం ఉన్న పిల్లలకు మాత్రమే జాతకాలు చెప్పకూడదు .అది మాకు తెలుసు.ఒకవేళ అలా చెప్తే వారికి ఉండే గడాలు గురించి కూడా చెప్పాలి.

అలా చెప్పడం మరింత ప్రమాదకరంగా మారుతుంది అయితే మెగా మనవరాలు జాతకంలో ఏ విధమైనటువంటి అరిష్టం లేదు ఆమె జాతకం చాలా దివ్యంగా ఉంది ఆమె తాత తండ్రిని మించిన గొప్ప జాతకురాలు అవుతుందని వేణు స్వామి తెలిపారు.

Venu Swamy Comments About Klin Kaara ,venu Swamy,klin Kaara,prabhas, Tollywood
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఈ విధంగా ఈ చిన్నారి జాతకం ఎంతో గొప్పగా ఉంది కనుక తన గురించి మాట్లాడానని తన జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు గండాలు లేకపోవడం వల్లే తాను జాతకం చెప్పాను ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, ఊరికే ఏదో ఒకటి ట్రోల్ చేయాలి కదా అంటూ ట్రోల్ చేయడం మంచిది కాదు అంటూ తన గురించి వచ్చినటువంటి విమర్శల పట్ల ఈ సందర్భంగా వేణు స్వామి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు