వెంకటేష్ నటించిన ఈ ఫ్యామిలీ సినిమా ఇన్ని భాషల్లో రీమేక్ అయ్యిందా ?

ఇప్పుడు యాక్షన్ సినిమాలు లేదా థ్రిల్లర్ సినిమాల ట్రెండు ఎక్కువగా నడుస్తుంది.కానీ కొన్నేళ్లు వెనక్కి వెళితే ఎక్కువగా ఫ్యామిలీ కథలనే ప్రేక్షకులు ఆదరించేవారు.

కుటుంబమంతా వెళ్లి కూర్చొని సినిమా చూడడానికి ఇష్టపడేవారు.థియేటర్స్ కి జనాలు ఎక్కువగా వచ్చే రోజులు కాబట్టి అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యామిలీ సబ్జక్ట్స్ విపరీతంగా నచ్చేది.

ఇలా ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలు( Family Movies ) తీసి సినిమా ఇండస్ట్రీలో దాదాపు 30 ఏళ్లుగా హీరో గా కొనసాగుతున్నారు హీరో వెంకటేష్.( Hero Venkatesh ) ఆయన తన కెరియర్లో అన్ని రకాల ఫ్యామిలీ స్క్రిప్ట్స్ ని టచ్ చేసారు.

అందులో 90% విజయాలు అందుకోవడం విశేషం.ఇలా వెంకటేష్ నటించిన అనేక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ లో అందరికి చాలా ఎక్కువగా నచ్చిన సినిమా పవిత్ర బంధం.

Advertisement

( Pavitra Bandham ) ఈ సినిమా 1996లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

భూపతి రాజా అందించిన స్క్రిప్ట్ తో ముత్యాల సుబ్బయ్య( Muthyala Subbaiah ) ఈ సినిమాని తెరకెక్కించగా అప్పట్లో ఇది ఒక ఛాలెంజింగ్ సబ్జెక్టు అనుకోవచ్చు.ఎందుకంటే విదేశాల్లో విచ్చలవిడిగా తిరిగి వచ్చిన అబ్బాయికి ఇక్కడ అగ్రిమెంట్ పెళ్లి అనేది అప్పటి వారికి చాలా కొత్త విషయం.ఆడవారికి ఎక్కువగా సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ని ఫ్యామిలీ ఆడియన్స్( Family Audience ) ఒప్పుకుంటారా అని అనుమానం అప్పట్లో చాలామంది వ్యక్తం చేశారు.

ఈ స్క్రిప్ట్ చేయడానికి హీరోలు సాహసం కూడా చేయలేదు.అయినా కూడా ఎందుకో వెంకటేష్ దీనిని బలంగా నమ్మారు.ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలయ్యాక ఎంతో మంది మహిళల అభిమానాన్ని చూరగొంది.

ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవలేదు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

దీనిని ఆరు భాషల్లో రీమేక్ చేశారు.విడుదలైన అన్ని భాషల్లో కూడా విజయం సాధించడం ఈ సినిమాకి ఉన్న స్పెషాలిటీ.తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్, ఒరియా వంటి ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.

Advertisement

కన్నడలో అనురాగ అరలితు తర్వాత ఆరు భాషల్లో విడుదలైన చిత్రం పవిత్ర బంధం మాత్రమే.ఈ సినిమాకి మేజర్ గా వెంకటేష్ ఎంత ముఖ్యమో అంతకన్నా కూడా సౌందర్య( Soundarya ) నటన వెయ్యిరెట్ల బలాన్ని ఇచ్చింది.

అప్పట్లో సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ కున్న క్రేజ్ వేరు.

తాజా వార్తలు