ఇప్పటికి ఎన్ని ముహూర్తాలో..!

‘గోపాల గోపాల’ సినిమా తర్వాత వెంకటేష్‌ కెమెరా ముందుకు వచ్చింది లేదు.దాదాపు సంవత్సరంకు పైగా వెంకటేష్‌ కెమెరాకు దూరంగా ఉంటున్నారు.

‘గోపాల గోపాల’ సినిమా విడుదల అయిన రెండు నెలల నుండి కూడా వెంకటేష్‌ తర్వాత సినిమా ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది అంటూ మీడియాలో వార్తలు రావడం జరుగుతూనే ఉంది.వెంకటేష్‌ హీరోగా ఆ దర్శకుడి దర్శకత్వంలో సినిమా రాబోతుంది, ఈ దర్శకుడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుంది అంటూ మీడియాలో మరియు సినీ వర్గాల్లో ఎక్కడ లేని వార్తలు ఎన్నో సార్లు వచ్చాయి.

కాని అవన్ని ఒట్టి పుకార్లుగానే మిగిలి పోయాయి.చివరకు మారుతి దర్శకత్వంలో వెంకీ సినిమా ప్రారంభం కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన రాక పోయినా ఒక క్లారిటీ అయితే వచ్చింది.

దాంతో అప్పటి నుండి కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభంకు ముహూర్తం ఖరారు అయ్యింది అంటూ వార్తల మీద వార్తలు వచ్చాయి.సినీ వర్గాల్లో సైతం ఈ విషయంపై చాలా చర్చ జరిగింది.

Advertisement

కాని ఇప్పటి వరకు కూడా మారుతి, వెంకీల సినిమాకు క్లాప్‌ పడ్డది లేదు.అసలు వీరి కాంబోలో మూవీ ఎప్పుడు ప్రారంభం అయ్యేనో, ముహూర్తం ఎప్పుడు ఫిక్స్‌ అయ్యేనో చూడాలి.

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభంకు వచ్చే నెల 16ను ఫిక్స్‌ చేశారట.మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనే విషయం మాత్రం నన్ను అడగకండి.

Advertisement

తాజా వార్తలు