వర్మ అలా చెప్పి, ఇలా చేశాడు!

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.

వచ్చే నెల 4న సినిమాను తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని గందపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కించిన విషయం తెల్సిందే.ఈ సినిమా ఆరంభంకు ముందు వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి వద్ద వర్మ పర్మీషన్‌ తీసుకున్నాడు.

కాని ఆమె ఇప్పుడు సినిమా విడుదలకు అడ్డు పడుతోంది.కారణం తనకు వర్మ ఒకటి చెప్పి ఇప్పుడు మరోటి చేస్తున్నాడు అంటోంది.

సినిమా ఆరంభంకు ముందు తాను వీరప్పన్‌ జీవిత కథతో హిందీలో సినిమా చేస్తాను అన్నాడని, కాని ఇప్పుడు సౌత్‌లో విడుదల చేయబోతున్నాడని, ఇది తమకు ఇష్టం లేదు అని ముత్తు లక్ష్మి అంటోంది.కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల అయితే తమ కుటుంబం సమస్యు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే ఈ సినిమాను దక్షిణ రాష్ట్రాల్లో విడుదల చేయవద్దని ఆమె డిమాండ్‌ చేస్తుంది.

Advertisement

కాని వర్మ అలాంటివి పట్టించుకునే రకం కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వర్మ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 4న తాను అనుకున్న అన్ని భాషల్లో కూడా సినిమాను విడుదల చేయబోతున్నాడు.

మరి ముత్తు లక్ష్మి ఏం చేస్తారు అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు