'వీరసింహారెడ్డి' ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి అదిరిపోయే అప్డేట్!

నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా వీరసింహారెడ్డి.

మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస సాంగ్స్ రిలీజ్ చేసారు.అలాగే తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో ఇంటర్వెల్ అద్భుతమైన ఎమోషనల్ తో సాగుతుందని.

సినిమా మొత్తంలోనే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

Advertisement

అలాగే ఈ సీక్వెన్స్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోనుందని అంటున్నారు.మొత్తానికి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందా అనే క్యూరియాసిటీ అయితే ప్రేక్షకుల్లో పెరిగింది.ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

మరి సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే. బాలయ్య అఖండ వంటి బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.మరి వీరసింహ రెడ్డి సినిమాతో ఇదే విజయాన్ని కొనసాగిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement