వరుణ్ తేజ్ ను కాపాడే డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాత్రమేనా.. ఫిదా రేంజ్ హిట్ ఇస్తారా?

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

వరుణ్ తేజ్( Varun Tej ) ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలలో నటించినప్పటికీ ఆయన కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు.

అంతో ఇంతో అంటే ఫిదా మూవీ అని చెప్పవచ్చు.అయితే వరుణ్ తేజ్ సినిమాలలో నటిస్తున్నాడు కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు.

ఈ మధ్య కాలంలో వరుణ్ నటించిన గని, గాండీ వధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్( Gani, Gandhi Vadhari Arjuna, Operation Valentine ) లాంటి మూవీస్ చేదు అనుభవాలను మిగిల్చాయి.

మార్కెట్ అంతా దెబ్బ తిని తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు వరుణ్.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం హీరో వరుణ్ తేజ్ ఒక కొత్త మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తోంది.అది శేఖర్ కమ్ములతో ( Shekhar Kammula )కావడం విశేషం.

Advertisement

గతంలో శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఫిదా మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమా వరుణ్ తేజ్ కీ అటు సాయి పల్లవికి భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఆ సినిమా తరువాత మళ్లీ ఇప్పుడు కమ్ములతో ఒక సినిమా చేయడానికి అతను సిద్ధమయ్యాడట.

ప్రస్తుతం ధనుష్‌తో కుబేర( Kubera ) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న కమ్ముల.దీని తర్వాత వరుణ్‌తో చేసేందుకు ఒక కథను రెడీ చేశాడట.ప్రస్తుతం కథా చర్చలు పూర్తయ్యాయని త్వరలోనే సినిమాను అనౌన్స్ చేస్తారని అంటున్నారు.

ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది తెలియదు.ఒక కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?

మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.అలాగే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో వరుణ్ తేజ్ కీ ఈ సినిమా ఏలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు