ఆ లక్కీ హౌస్ లో నివాసం ఉంటున్న వరుణ్ తేజ్ లావణ్య.. దశ తిరగడం ఖాయమా?

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ గురించి మనందరికీ తెలిసిందే.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Mega Prince Varun Tej) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు వరుణ్ తేజ్.ఇకపోతే వరుణ్ తేజ్ (varun tej)హీరోగా నటించిన తాజా చిత్రం మట్కా.

ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.ఇది ఇలా ఉంటే హీరో వరుణ్ తేజ్ కి లక్కు కొద్దిగా కలిసొచ్చినట్టుగా కనిపిస్తోంది.

Advertisement
Varun Tej Shift To Pv House, Varun Tej, Tollywood, New House, Matka Movie, Mega

తాజాగా వరుణ్ తేజ్ ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి(New House) మారారు.మొన్నటి వరకు నాగబాబు (Naga babu)ఫ్యామిలీ మణికొండ లో ఉండేవారు.

కానీ తాజాగా జూబ్లీహిల్స్ కు మారారు.అది కూడా ఒక లక్కీ హౌస్ (Lucky House)లోకి మారినట్టు తెలుస్తోంది.

ఆ హౌస్ మరి ఎవరితో కాదండోయ్.మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఒక మంచి భవంతి వుంది.

అది ప్రస్తుతం అయన వారసుల కంట్రోల్ లో వుంది.ఈ బిల్డింగ్ కట్టిన తరువాతే పివి ప్రధాని అయ్యారని అంటారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

అలాగే ఈ భవంతిని మైత్రీ మూవీస్(Mythri Movies) సంస్థ అద్దెకు తీసుకుంది.ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య, సర్కారు వారి పాట ఇవన్నీ ఈ భవంతిలో వున్నపుడు నిర్మించినవే.

Advertisement

మరి ఎందుకో మైత్రీ సంస్థ ఈ భవంతిని ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఈ భవంతిని నాగబాబు(Naga Babu) కుటుంబం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మేరకు ఖర్చు చేసి మంచి ఇంటీరియర్ అంతా చేయించినట్లు తెలుస్తోంది.ఇటీవలే నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్‌ లావణ్య త్రిపాఠీ, నిహారిక (Nagababu couple, Varun Tej Lavanya Tripathi, Niharika)ఈ ఇంట్లోకి మారారట.

ఇటీవలే దీపావళి సందర్భంగా పవన్ కూడా ఈ ఇంటికి వచ్చారట.ఇల్లంతా తిరిగి చూసారట ప్రత్యేకంగా తన గది చూసారని హీరో వరుణ్ తేజ్‌ వెల్లడించారు.ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్‌.

ఇటీవల కొంత కాలంగా సరైన హిట్ పడలేదు.ఈ లక్కీ హవుస్ లోకి మారిన నేపథ్యంలో అయినా మాంచి హిట్ పడుతుందేమో? చూడాలి మరీ.ఒకవేళ మట్కా సినిమా కనుక హిట్ అయితే వరుణ్ తేజ్ కి లకు కలిసి వచ్చినట్టే అని చెప్పాలి.మరి చాలా కాలంగా సరైన హిట్టు లేక అసలైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నా వరుణ్ తేజ్ కు మట్కా సినిమా అయినా సరైన సక్సెస్ను అందిస్తుందేమో చూడాలి మరి.

తాజా వార్తలు