మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈయన త్వరలోనే మట్కా (Matka) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా రాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేసారు.ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి భార్య పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) పాత్ర గురించి ప్రశ్నించారు.ఈ విషయం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.
ప్రతి సక్సెస్ ఫుల్ అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి ఉంటుంది.నీకు ఈ సినిమాలో కూడా వాసు అనే క్యారెక్టర్ అని భయపెట్టేది కూడా కేవలం తన భార్య పాత్రే.అతను దారి తప్పుతున్నాడు అంటే సరిచేసేది భార్య పాత్రే.
వాడు ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందేనని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
నిజ జీవితంలో మీరు కూడా లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) మాట వింటున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్(Varun Tej, Lavanya Tripati) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి మిస్టర్ సినిమాలో మొదటిసారి కలిసిన నటించారు.
ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్న ఈ జంటగత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో ఇటలీలో వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి వివాహం జరిగే సరిగా ఏడాది పూర్తి అయింది.ఇలా పెళ్లయిన ఏడాదికే ఈయన సినిమా గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కడు భార్య మాట వినాల్సిందే అని కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
ఇక ఈయన నటిస్తున్న మట్కా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy