Varun tej : వరుణ్ తేజ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. అక్కడే తప్పు జరుగుతోందా?

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ( Varun tej )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

వరుణ్ తేజ్ ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలలో నటించినప్పటికీ ఆయన కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు.

అంతో ఇంతో అంటే ఫిదా మూవీ అని చెప్పవచ్చు.అయితే వరుణ్ తేజ్ సినిమాలలో నటిస్తున్నాడు కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు తగ్గడం లేదు.

వరుణ్ తేజ్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్( Ram Charan, Allu Arjun, Sai Dharam Tej ) లు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు.

Varun Tej Movie Experiments

కొంత ప్రయోగం ఉన్న కచ్చితంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండేలా చూసుకుంటారు.అయితే వరుణ్ తేజ్ మాత్రం వారికి విరుద్ధంగా కంటెంట్ బేస్డ్ మూవీస్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు.మొదటి సినిమా ప్రయోగాత్మక చిత్రంగానే తెరకెక్కింది.

Advertisement
Varun Tej Movie Experiments-Varun Tej : వరుణ్ తేజ్ సిన�

తరువాత కమర్షియల్ లైన్ లోకి వరుణ్ తేజ్ వచ్చిన కూడా డాన్స్ రాకపోవడం వాటి వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే మాట వినిపిస్తోంది.తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథలు ఎక్కువగా చేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు.

అయితే వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలకి బిగ్ స్క్రీన్ పై మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.ఫిదా ప్యూర్ లవ్ స్టోరీగా చేశాడు.

Varun Tej Movie Experiments

ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యింది.ఓపెనింగ్స్ తక్కువ వచ్చిన లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది.అయితే తొలిప్రేమ సినిమా( tholiprem amovie ) మొదటి రోజు ఏకంగా 10 కోట్ల గ్రాస్ అందుకుంది.

అలాగే గద్దలకొండ గణేష్ కూడా ఫస్ట్ డే 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.ఆ స్థాయిలో మరల ప్రభావం చూపించిన సినిమాలు వరుణ్ తేజ్ నుంచి రాలేదు.మిస్టర్ మూవీ డిజాస్టర్ అయిన మొదటి రోజు 5.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.అయితే వరుణ్ తేజ్ ప్రయోగాత్మకంగా చేసిన గని మూవీ మొదటి రోజు కేవలం 4.8 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.గత ఏడాది రిలీజ్ అయినా గాండీవదారి అర్జున్ 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజాగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) మూవీ కూడా 2 కోట్ల కంటే తక్కువ గ్రాస్ మొదటి రోజు వసూళ్లు చేసింది.అంటే వరుణ్ తేజ్ కి ప్రయోగాలు చేయాలనే ఇంటరెస్ట్ ఉన్నా కూడా ఆడియన్స్ మాత్రం ప్రయోగాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Advertisement

కొత్త కథల కంటే ముందు మెగా ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే కమర్షియల్ స్టార్ గా వరుణ్ తేజ్ ఎస్టాబ్లిష్ కావాలని ఆశిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ మట్కా కమర్షియల్ లైన్ లోనే రానుంది.

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో వస్తోంది.ఈ సినిమా అయిన అతని ఇమేజ్ ని మళ్ళీ నిలబెడుతుందేమో చూడాలి మరి.

తాజా వార్తలు