సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా స్పిరిట్.

( Spirit ) ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇప్పటికే టెక్నికల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

ఇక మిగిలింది కేవలం నటీనటుల ఎంపిక మాత్రమే అని తెలుస్తోంది.ఈ విషయంలో సందీప్ రెడ్డి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమకు సంబంధించి చాలా రకాల వార్తల సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.ఆ వార్తలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

Advertisement

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ ని( Varun Tej ) ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మూవీ మేకర్స్.ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ తో డైరెక్టర్ సందీప్ చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

వరుణ్ కూడా అందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

హీరో పాత్ర‌కు చాలా ధీటుగా ఈ రోల్ ని రాసిన‌ట్లు వినిపిస్తోంది.సందీప్ సినిమాల్లో హీరో, విల‌న్ పాత్ర‌లు ఎంత బ‌లంగా ఉంటాయి?

అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.యానిమ‌ల్ సినిమాతో అది ప్రూవ్ అయింది.స్పిరిట్ ప‌క్కా రా మెటీరియ‌ల్ అని ముందే హింట్ ఇచ్చేసాడు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

నాలుగైదు ర‌కాల డ్ర‌గ్స్ ఇచ్చిన మ‌త్తులా ఈ సినిమా క‌థ ప్రేక్ష‌కులకు అందిస్తుంద‌ని అన్నాడు.దీన్నిబట్టి ఈ సినిమాలో పాటలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నది అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

తాజా వార్తలు