సమంతను హీరోయిన్ గా తీసుకోవద్దు.. ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్స్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) త్వరలోనే హనీ బన్నీ( Honey Bunny ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

నవంబర్ 7వ తేదీ ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఇక ఈ సిరీస్ లో సమంతకు జోడిగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన విషయం తెలిసినదే.

ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ ధావన్ సమంతకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

ఈ వెబ్ సిరీస్ కమిట్ అయిన సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొన్ని బిగ్ విగ్స్ ఈ సిరీస్ లో సమంతతో కలిసి నటించవద్దు అంటూ నాకు వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.పలువురు స్టార్స్ నాకు ఫోన్ చేసి మరి బెదిరించారని సమంతకు బదులుగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలి అంటూ తనకు సలహాలు కూడా ఇచ్చారని వరుణ్ ధావన్ తెలిపారు.ఇక ఈ విషయాన్ని ఈయన బయట పెట్టడంతో సమంత పై బాలీవుడ్ ఇండస్ట్రీలో వారికి ఎందుకు అంత కోపం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సమంత ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఎదుగుదలను అడ్డుకోవడం కోసమే కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువగా ఉందని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వెల్లడించారు.

ఈ క్రమంలోనే సమంతకు కూడా అక్కడ అవకాశాలు లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతుంది.మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేశారనే విషయాన్ని మాత్రం వరుణ్ ధావన్ బయట పెట్టలేదు.

Advertisement

తాజా వార్తలు