ఆర్ఆర్ఆర్‌తో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ కళ్లు కాయలు కాచేలా చూస్తు్న్నారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ వాయిదా పడటంతో ఓ డైరెక్టర్ చాలా నిరాశకు లోనవుతున్నాడు.

Vamsi Paidipally Worried About Rrr Delay Vamsi Paidipally, RRR, Ram Charan, NTR

గతంలో మహేష్ బాబుతో మహర్షి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆ తరువాత మహేష్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కేసింది.

దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తన కథను వినిపించాడట వంశీ.కథ నచ్చడంతో చరణ్ కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

Advertisement

కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయిన తరువాతే తన నెక్ట్స్ మూవీని ప్రారంభిస్తానని చరణ్ చెప్పడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని వంశీ పైడిపల్లి ఆశగా చూస్తున్నాడట.అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆలస్యం అవుతున్నకొద్దీ వంశీ కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది.

మ‌ల్టీవిట‌మిన్ టాబ్లెట్లు రెగ్యుల‌ర్ గా వేసుకోవ‌చ్చా?
Advertisement

తాజా వార్తలు