జలదిగ్బంధంలో అల్లూరి జిల్లాలోని వడ్డిగూడెం

అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.గోదావరి నది చుట్టు ముట్టడంతో ప్రజలు నీటిలో చిక్కుకుని పోయారు.

గ్రామంలో నడుము లోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అప్రమత్తమైన అధికారులు వడ్డిగూడెం గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

మరోవైపు చింతూరు మండలం కుయుగురు వద్ద బ్రిడ్జి నీటమునిగింది.దీంతో చింతూరు నుంచి ఒరిస్సాకు వెళ్లే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది.

అదేవిధంగా ఎటపాక మండలం మురుమురు వద్ద ప్రధాన రహదారిపై గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ క్రమంలో కూనవరం నుంచి భద్రాచలంకు వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...