హుజూర్‌ నగర్‌ ఓటమిపై వీహెచ్‌ కామెంట్స్‌

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భార్య ఉత్తమ్‌ పద్మావతి హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంను ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.

పార్టీ నాయకులు ఐక్యమత్యంగా లేకపోవడంతో పాటు ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ఓటమి చవిచూడాల్సి వచ్చింది అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు.

ఒంటెద్దు పోకడల కారణంగానే హుజూర్‌ నగర్‌లో ఓటమి అంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ కామెంట్‌ చేశాడు.ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఓటమిని ఊహించలేదన్నాడు.

ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశాడు.సమీక్ష డిమాండ్‌ చేసే వరకు కూడా పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌ ఉండాలని ఆయన అన్నాడు.

రేవంత్‌ రెడ్డి దూకుడు మరియు ఆయన వ్యాఖ్యలు కూడా పార్టీకి నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని, అందరిని కలుపుకుని పోయే విధంగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.త్వరలో కొత్త పీసీసీ ప్రెసిడెంట్‌ వస్తాడంటూ వీహెచ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ సమయంలోనే తాను పీసీసీ ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు