తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేసే పవర్ ఫుల్ ఆయిల్.. వారానికి ఒక్కసారి వాడిన చాలు!

సాధారణంగా వయసు పైబడే కొద్దీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది.దీని కారణంగా నల్లగా నిగనిగలాడుతూ కనిపించాల్సిన జుట్టు తెల్లబడటం స్టార్ట్ అవుతుంది.

అయితే తెల్ల జుట్టును ఎవ్వరూ అంగీకరించలేరు.అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

మీకు ఆ అవసరం రాకూడదు అంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడండి.తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేయడానికి ఈ ఆయిల్ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

వారానికి ఒక్కసారి వాడిన చాలు తెల్ల జుట్టుకు ( White hair )దూరంగా ఉండవచ్చు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పది బాదం పప్పులు, ఒక కప్పు ఎండిన కరివేపాకు, అంగుళం ఎండిన అల్లం వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆవ నూనె వేసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, అల్లం మరియు కరివేపాకు వేసి చిన్న మంటపై ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ ( Henna powder )వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక అప్పుడు క్లాత్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.జుట్టు ఆరోగ్యానికి ఈ ఆయిల్ చాలా మేలు చేస్తుంది.

వారానికి ఒకసారి స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ ను వాడిన చాలు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

Advertisement

ఒకవేళ ఆల్రెడీ తెల్ల జుట్టు ఉంటే క్రమంగా నల్లబడుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా తయారవుతాయి.

తాజా వార్తలు