ఈ హోం మేడ్ లిప్ గ్లాస్ ను వాడితే పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి!

పెదాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపించడంలో లిప్ గ్లాస్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకే చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల లిప్ గ్లాస్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే మార్కెట్లో దొరికే లిప్ గ్లాస్ లు వాడటం వల్ల పెదాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ లిప్ గ్లాస్ ను వాడితే పెదాలు గులాబీ రంగులో మెరుస్తాయి.

అలాగే పెదాల అందం మరింత రెట్టింపు అవుతుంది.మరి ఇంతకీ ఆ హోమ్ మేడ్ లిప్ గ్లాస్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Use This Homemade Lip Gloss To Make Your Lips Glow Pink, Homemade Lip Gloss, Li

ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి కనీసం ప‌ది నిమిషాల పాటు హిట్ చేయాలి.

Use This Homemade Lip Gloss To Make Your Lips Glow Pink, Homemade Lip Gloss, Li
Advertisement
Use This Homemade Lip Gloss To Make Your Lips Glow Pink!, Homemade Lip Gloss, Li

అనంతరం హిట్ చేసుకున్న మిశ్రమాన్ని కాటన్ వస్త్రం సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.అంతే మన హోమ్ మేడ్ లిప్ గ్లాస్ రెడీ అవుతుంది.దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ హోమ్ మేడ్ లిప్ గ్లాస్ ను రోజు కనుక వాడితే పెదాలు సహజంగానే గులాబీ రంగులోకి మార‌తాయి.అలాగే ఈ లిప్ గ్లాస్ మీ పెదవులకు మరింత అందాన్ని, మెరుపుని ఇవ్వడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అదే స‌మ‌యంలో ఇది మీ లిప్స్కు కాంతిని అందిస్తూ అవి షైనీగా ప్రతిబింబించేలా చేస్తుంది.అంతేకాకుండా ఈ హోమ్ మేడ్ లిప్ గ్లాస్‌ ను వాడటం వల్ల మీ పెదవులు మందంగా, మరింత జ్యూసీగా కనిపిస్తాయి.

కాబట్టి తప్పకుండా ఈ లిప్ గ్లాస్ ను త‌యారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు