అక్రమ వలసదారుల బహిష్కరణ : బ్రిటన్ యువరాజు విషయంలో ట్రంప్ నిర్ణయం ఏంటీ?

అమెరికాలో అక్రమ వలసదారులకు చోటు ఉండకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.

( Donald Trump ) ఇప్పటికే గడువు తీరినా అక్రమంగా నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు.

వీరిలో భారతీయులు కూడా ఉన్నారు.ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజవంశానికి చెందిన, డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ ( Prince Harry, Duke of Sussex )విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.

శుక్రవారం న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ప్రిన్స్ హ్యారీ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌తో యాంకర్ ప్రస్తావించారు.తన భార్య మేఘన్ మార్క్లే‌తో కలిసి జనవరి 2020లో బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా రాజీనామా చేసిన ప్రిన్స్ హ్యారీ.

తన భార్య మేఘన్( Meghan ) స్వస్థలమైన దక్షిణ కాలిఫోర్నియాకు వచ్చారు.తాజా ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీపై ఎలాంటి చర్యలు తీసుకునేది లేదన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్.

Advertisement

ఆయనను నేను వదిలేస్తానని.ఇప్పటికే భార్యతో ప్రిన్స్ హ్యారీ పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడని వ్యాఖ్యానించారు.

ప్రిన్స్ హ్యారీ వీసాకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, ముఖ్యంగా హెరిటేజ్ ఫౌండేషన్ ( Heritage Foundation )నుంచి వచ్చిన సవాళ్ల మధ్య డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రకటన వచ్చింది.వీసా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ప్రిన్స్ హ్యారీ గతంలో అక్రమ మాదక ద్రవ్యాల వాడకాన్ని వెల్లడించడంలో విఫలమవ్వడంపై హెరిటేజ్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే ట్రంప్‌పై మేఘన్ మార్ల్కే ఎప్పుడూ హాట్ హాట్ విమర్శలు చేసేవారు.ఆయన విభజనకారుడని, స్త్రీ ద్వేషని వ్యాఖ్యానించింది.ట్రంప్ కూడా హ్యారీని ఎగతాళిగా మాట్లాడటం.

యువరాజుపై మేఘన్ చేయి చేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేసేవారు.అయితే యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌పై హెరిటేజ్ ఫౌండేషన్ దావా వేయడంతో ప్రిన్స్ హ్యారీ వీసా దరఖాస్తుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

కొకైన్, గంజాయితో పాటు సైకెడెలిక్స్‌ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రిన్స్ హ్యారీ తన ఆత్మకథ స్పేర్‌తో ప్రస్తావించడమే ఈ వివాదానికి కారణం.

Advertisement

తాజా వార్తలు