లిమిట్ క్రాస్ .. హెచ్ 2 బీ వీసా దరఖాస్తు విండోను క్లోజ్ చేసిన అమెరికా

2025 ఆర్ధిక సంవత్సరం రెండో అర్ధభాగం ప్రారంభంలో తిరిగొచ్చే కార్మికుల కోసం ఉద్దేశించిన అదనపు 19000 హెచ్ 2 బీ వీసాల( H-2B Visa ) కింద పిటిషన్లు దాఖలు చేయడానికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)( US Citizenship and Immigration Services ) విండోను మూసివేసింది.

దరఖాస్తులు ఏప్రిల్ 18 నాటికి పరిమితికి మించి చేరుకున్నాయని ఏజెన్సీ తెలిపింది.

ఈ తేదీ తర్వాత స్వీకరించబడిన ఏవైనా దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఏప్రిల్ 24న జారీ చేసిన నోటీసులో యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.అదనపు వీసాలు ఎఫ్‌వై 2025 హెచ్ 2 బీ సప్లిమెంటల్ క్యాప్( FY 2025 H-2B Supplemental Cap ) తాత్కాలిక తుది నియమం ప్రకారం జారీ చేయబడ్డాయి.

ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ప్రారంభ తేదీలలో తిరిగి వచ్చే కార్మికులు యునైటెడ్ స్టేట్స్‌లో( United States ) తాత్కాలిక వ్యవసాయేతర ఉద్యోగాలను చేపట్టడానికి వీలు కల్పిస్తుంది.ఆతిథ్యం, నిర్మాణం, నిర్వహణ వంటి రంగాల కార్మికులకు వీటిని ఎక్కువగా కేటాయిస్తారు.

తిరిగి వచ్చే కార్మికులకు 19 వేల వీసాల పరిమితి ముగిసినప్పటికీ ఎల్ సాల్వడర్, గ్వాటెమాల , హోండురాస్, హైతీ, కొలంబియా, ఈక్వెడార్, కొస్టారికా జాతీయులకు 20 వేల హెచ్ 2 బీ వీసాల ప్రత్యేక కోటా అందుబాటులో ఉంది.తిరిగి వచ్చే కార్మికుల మాదిరిగా కాకుండా.ఈ దేశాలకు చెందిన దరఖాస్తుదారులకు ముందస్తు హెచ్ 2 బీ వీసా హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు.

Advertisement

అమెరికాలోని యజమానులు స్వల్పకాలిక, వ్యవసాయేతర ఉద్యోగాలకు , సాధారణంగా సీజనల్ లేదా పీక్ లోడ్ ఉద్యోగాలకు విదేశీ పౌరులను నియమించుకోవడానికి హెచ్ 2 బీ వీసా అనుమతిస్తుంది.ఈ కార్యక్రమం వార్షిక పరిమితి 66 వేల వీసాలు. వీటిని ఆర్ధిక సంవత్సరంలో రెండు భాగాలలో సమానంగా విభజించారు.

హెచ్ 2 బీ వీసాపై అమెరికాలో గరిష్టంగా మూడేళ్లు ఉండొచ్చు.గడువు ముగిసిన తర్వాత మరోసారి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం మూడు నెలలు అమెరికా వెలుపల ఉండాలి.

అయితే భారతీయులు హెచ్ 2 బీ వీసా కార్యక్రమానికి అనర్హులుగా ఉన్నారు.యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఎంపిక చేసిన దేశాల జాబితాలో భారతదేశం లేదు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు