ఉప్పెనలా దూసుకొచ్చి వెనక్కి పారిపోయిన హీరో

మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్న మరో యంగ్ స్టార్ వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం తన తొలి చిత్రం ‘ఉప్పెన’ను రిలీజ్‌కు రెడీ చేశాడు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పటినుండో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలు, థియేటర్లు కూడా మూతపడ్డాయి.దీంతో టాలీవుడ్‌లో రిలీజ్ కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడ్డాయి.

ఈ క్రమంలో ఉప్పెన సినిమాను కూడా ఏప్రిల్ 2 నుండి ఏకంగా మే 7వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమాను కచ్చితంగా ఆ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా మారితే సినిమాను త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సుకుమార్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరి ఈ సినిమా మే 7న రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు