Upasana : రెండో బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నాను.. ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఉపాసన కొణిదల( Upasana Konidala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రామ్ చరణ్ భార్యగా మెగా కోడలిగా ఉపాసన మనందరికీ సుపరిచితమే.

ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు చూసుకుంటూనే రొకవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది.అలాగే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇటీవల కాలంలో ఈమె తరుచూ సూచన మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఇది ఇలా ఉంటే ఉపాసన రామ్ చరణ్ దంపతులకు పెళ్లి అయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే.ఆ పాపకు క్లీంకార ( Klinkara )అనే పేరును కూడా పెట్టారు.అయితే ఉపాసన, రామ్ చరణ్ లకు పాప పుట్టే ముందు వరకు కూడా చాలామంది ఎన్నో సందర్భాలలో పిల్లల గురించి ప్రశ్నించారు.

Advertisement

కానీ సమయం వస్తే చెప్తాము అంటూ ఉపాసనా చెర్రీ ఆ విషయం గురించి పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చారు.ఆ తర్వాత పిల్లల్ని గురించి ప్లాన్ చేసుకున్నారు.

అలా గత ఏడాది క్లీంకారకు జన్మనిచ్చారు ఉపాసన దంపతులు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఉపాసన రెండవ సంతానం( Second child ) గురించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మరి ఆ వివరాల్లోకి వెళితే.తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఉపాసన మాట్లాడుతూ.

మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను.

Advertisement

జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయం.నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నాను.

నా పక్కనున్న మేడమ్‌ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారు.ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు.

అది నా ఇష్టం.అంతేకాదు, నేను సెకండ్‌ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది ఉపాసన.

కాగా ఈ సందర్బంగా ఉపాసన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు