వీడియో వైరల్: రైలు కింద చిక్కుకొని వంద కి.మీ. ప్రయాణించిన బాలుడు.. చివరికి..?

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) ఓ బాలుడు గూడ్స్ రైలు( Goods Train ) కింద పొరపాటుగా చిక్కుకొని ఏకంగా 100 కి.

మీ.

సాహస ప్రయాణం చేశాడు.ఈ సంఘటనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రైల్వే స్టేషన్ చుట్టుపక్కల్లో నివాసముంటున్న చిన్నారి రైల్వే స్టేషన్ లోని రైల్వే ట్రాక్( Railway Track ) దగ్గరికి ఆడుకోడానికి వచ్చారు.అలా ఆడుకుంటున్న ఓ చిన్నారి పిల్లోడు ఆటలో భాగంగా అతడు గూడ్స్ రైలు చక్రాల వద్ద ఆడుకుంటున్నాడు.

ఇందులో భాగంగా అతడు రైల్వే చక్రాల మధ్యలో ఉన్న ఓ చిన్న స్థలంలో ఎక్కి కూర్చున్నాడు.అలా కూర్చున్న సమయంలో అనుకోకుండా గూడ్స్ రైలు అకస్మాత్తుగా కదలడంతో ఆ అబ్బాయికి ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

దాంతో అబ్బాయి అక్కడ నుంచి దిగకుండా అలాగే ఉండిపోయాడు.ఇక చేసేదేమీ లేక ఆ పిల్లోడు కుమారుడు రైలు చక్రాల మధ్య ఉన్న చిన్న స్థలంలో కూర్చుని ప్రమాదకర స్థాయిలో దాదాపు 100 కి.మీ.ప్రయాణం చేసేసాడు.ఆ తర్వాత రాష్ట్రంలోని హోర్డాయి స్టేషన్ కు( Hardoi Station ) వచ్చాక గూడ్స్ రైలు ఆగింది.

ఆ తర్వాత రైలు సిబ్బంది చెకింగ్ లో భాగంగా రైలు చక్రాల వద్ద కూర్చున్న బాలుడు వారి కంటపడ్డాడు.

దాంతో స్టాఫ్ వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు.దాంతో వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బంది( RPF ) బాలుడు ఉన్న ప్రదేశానికి చేరుకొని ఆ అబ్బాయిని చక్రాల మధ్య నుంచి బయటికి తీశారు.ఇక ఆ పిల్లాడి గురించి విచారణలో భాగంగా వారి కుటుంబం అలంనగర్ రాజాజీపురం లోని బాలాజీ మందిర్ లో ఉంటున్నట్లుగా ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత ఆ పిల్లాడిని చైల్డ్ కేర్ హోమ్ కి తరలించగా పూర్తి విచారణ నిమిత్తం కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?
Advertisement

తాజా వార్తలు