ఎక్కువ సినిమాల్లో నటించడం తో ఆరోగ్యం పోగొట్టుకున్న హీరో ఇతడే !

హీరో సురేష్.అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన సురేష్ ఆ తర్వాత హీరోగా మారాడు.

తమిళ చిత్ర పరిశ్రమకు మొదట హీరోగా పరిచయమైన సురేష్ రామదండు అనే సినిమాతో 1981లో తొలిసారిగా హీరోగా తెలుగులో డెబ్యూ చేశాడు.ఇక గత 30 సంవత్సరాలుగా దాదాపు 250కు పైగా సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సురేష్ ఇప్పుడు కేవలం తండ్రి పాత్రలో ఎక్కువగా కనిపిస్తున్నాడు.

పాత్ర మంచిది అయితే ఎలాంటి సినిమా అయినా సరే చేయడానికి వెనుకాడడు సురేష్.అయితే తొలినాల్లలో ఎక్కువగా సహాయ పాత్రలతో పాటు హీరో గానే నటించాడు.

దాంతో సురేష్ కెరియర్ తెలుగు, తమిళ భాషల్లో అద్భుతంగా నడిచింది.ఎంత బాగా అంటే ఏకంగా ఒక సంవత్సరం 18 సినిమాల్లో హీరోగా నటించాడు అంటే అతను ఎంత బిజీ షెడ్యూల్ ని గడిపాడో మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Untold Facts About Hero Suresh Details, Hero Suresh, Hero Suresh Life Struggles,

అలా అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడిగా సురేష్ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.ఇక నటన సంగతి కాసేపు పక్కన పెడితే అతడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అనేక మందికి పని చేశాడు.

దాంట్లో 1995లో వచ్చిన ఆసయి సినిమాలో అజిత్ కుమార్ కోసం డబ్బింగ్ చేయడం అతని కెరియర్ లోనే మంచి విషయం అని చెప్పుకోవచ్చు.ఇక నాగార్జున వంటి హీరోల కోసం కూడా తమిళ సినిమాల్లో డబ్బింగ్ సురేష్ చెప్తూ ఉండేవాడు.

Untold Facts About Hero Suresh Details, Hero Suresh, Hero Suresh Life Struggles,

ఇక 18 సినిమాలు ఒకే సంవత్సరంలో చేయడంతో సురేష్ ఆరోగ్యం మీద తీవ్రం ప్రభావం చూపించింది.రోజు మూడు షిఫ్ట్ లలో పని చేయడం వల్ల అతడికి జాండీస్ సోకింది.అంతేకాదు సరైన తిండి, నిద్ర లేకపోవడంతో అతని బాడీ చాలా నీరసించిపోయింది అందుకే అక్కడ నుంచి తక్కువ సినిమాలో చేసిన సరే మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు సురేష్.

అలా ఎక్కువ సినిమాలో నటించడం తో ఆరోగ్యం పాడైన ఏకక హీరోగా సురేష్ చరిత్ర సృష్టించాడు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు