Balakrishna ,Unstoppable 2 :మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ తో బాలయ్య సందడి.. ఎపిసోడ్ 3 ప్రోమో వైరల్!

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇతడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంటూ కెరీర్ ను ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు.

బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్.సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూడగా ఇటీవలే సీజన్ 2 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి.

ఇక మూడవ ఎపిసోడ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే గత వారమే రావాల్సిన 3వ ఎపిసోడ్ ను కొన్ని కారణాల వల్ల ఆపేశారని తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ వారం కొత్త ఎపిసోడ్ రాబోతుంది.ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తుంటారు.

అయితే ఈసారి 3వ ఎపిసోడ్ కోసం మరో ఇద్దరు యంగ్ హీరోలను తీసుకు వచ్చారు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయినా ఆ యంగ్ హీరోలు మరెవరో కాదు శర్వానంద్, అడవి శేష్.

వీరిద్దరూ బాలయ్యతో కలిసి నెక్స్ట్ ఎపిసోడ్ అలరించ బోతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ను రిలీజ్ చేసారు.ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

యంగ్ హీరోలతో కలిసి బాలయ్య మరింత సందడి చేసారు.ఈ ప్రోమో ఈ ఎపిసోడ్ పై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఇక ఈ పూర్తి ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్ కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు