తెలుగులో సత్తా చాటుతున్న ఢిల్లీ పొలిటీషియన్ కొడుకు

కళారంగానికి ఎల్లలు లేవు.ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాలిపోవాల్సిందే.

నటులుగా సత్తా చాటుకోవాల్సిందే.

అంతేకాదు.

సినిమాలకు, పాలిటిక్స్ కు అవినాభావ సంబంధం ఉంది.రాజకీయ నాయకుల పిల్లలు సినిమాల్లోకి రావడం.

సినిమా రంగానికి చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం మామూలుగా కొనసాగుతూనే ఉన్నాయి.సినిమా రంగానికి చెందిన చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయిన వారు చాలా మంది ఉన్నారు.

Advertisement
Unknown Background Of Hero Deepak , MGR, NTR, Jayalalithaa, Vilasrao Deshmukh,

ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత మొదట్లో సినిమా రంగానికి చెందిన వారే.ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటుకున్నరు.

ముఖ్యమంత్రి పీఠాలను దక్కించుకున్నారు.అటు పలువురు రాజకీయా నాయకులు కొడుకులు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేశ్ ముఖ్ హీరోగా పరిచయం అయ్యాడు.ఆయన హీరోయిన్ జెనీలియాను పెళ్లి చేసుకున్నాడు.

అది వేరే విషయం.అలాగే నార్త్ కు చెందిన మరో రాజకీయ నాయకుడి కొడుకు మొదట్లో మోడలింగ్ లోకి వచ్చి.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.తెలుగలో పలు సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు.

Advertisement

ఇంతకీ ఆ పొలిటీషియన్ ఎవరు? ఆయన కొడుకు ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Unknown Background Of Hero Deepak , Mgr, Ntr, Jayalalithaa, Vilasrao Deshmukh,

తెలుగులో సంపంగి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు దీపక్.ఈ సినిమాకు సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించాడు.ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో రవితేజ మిత్రుడి క్యారెక్టర్ చేశాడు దీపక్.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు.

ఈ దీపక్ మరెవరో కాదు.ఢిల్లీ బీజేపీ కీలక నాయకుడు స్విందర్ జిత్ సింగ్.

ఢిల్లీ డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు.ఢిల్లీలోనే పుట్టి పెరిగిన దీపక్.

చదువుకునే సమయంలోనే మోడలింగ్ రంగంలోకి వచ్చాడు.ఆ తర్వాత సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాడు.

తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.సంపంగి, భ‌ద్ర‌, నీతోడు కావాలి, ప్రేమ‌లో పావ‌ని క‌ళ్యాణ్‌, కింగ్‌, మిత్రుడు, అరుంధ‌తి సినిమాల్లో నటించి మెప్పించాడు.

తాజా వార్తలు