బ్రేకింగ్ : కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కొద్దిసేపు క్రితం తుదిశ్వాస విడిచాడు.

ఈ విష‌యాన్ని ఆయ‌న‌ కుమారుడు చిరాగ్ పాస్వాన్ ధ్రువీకరించారు.

రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్ప‌త్రిలో గుండె ఆపరేషన్ చేపించుకున్నారు.దేశంలోని అత్యంత ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్ గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు.

గుండె సంబంధ ఇబ్బందుల‌తో ఆయ‌న చాలాకాలంగా బాధ‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తుంది.తన తండ్రి మరణ వార్త గురించి లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌ జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ.

"పాపా.ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు అంతే , మీరు ఎక్కడ ఉన్నా ప్రతిక్షణం నాతోనే ఉంటార‌ని నాకు తెలుసు.

Advertisement

మిస్ యు పాపా అని తెలిపారు.తండ్రి ఆరోగ్యం గురించి ఈ మద్యే చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.

గత కొన్ని రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా అర్ధరాత్రి సమయంలో గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చిందని , మళ్లీ అవసరమైతే కొన్ని వారాల తర్వాత కూడా మరొక ఆపరేషన్ నిర్వహించాల్సి రావ‌చ్చు అని తెలిపారు.

ఈ పోరాటంలో త‌న‌కు, త‌న కుటుంబానికి అండగా నిలిచిన ప్ర‌తీఒక్క‌రికీ ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

చలికాలంలో చేతులు పొడిబారకుండా మృదువుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!
Advertisement

తాజా వార్తలు