‘‘ UKs Skilled Worker visa ’’కి దరఖాస్తు చేస్తున్నారా .. అమల్లోకి అధిక వేతన పరిమితి

దేశంలో నానాటికీ పెరుగుతున్న వలసలను తగ్గించడానికి ప్రధాని రిషి సునాక్( Prime Minister Rishi Sunak ) సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.దీనిలో భాగంగా ‘‘ UKs Skilled Worker visas ’’ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులతో సహా విదేశీ కార్మికులకు గణనీయమైన అధిక వేతన పరిమితులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.

దీని ప్రకారం స్కిల్డ్ వర్కర్ వీసా విధానంలో దరఖాస్తు చేసుకునేవారి వేతనం .26,200 నుంచి 38,700 బ్రిటన్ పౌండ్లుగా వుండాలి.దీనిపై యూకే హోంశాఖ కార్యదర్శి జేమ్స్ క్లేవర్లీ స్పందించారు.

విదేశాల నుంచి యూకేకు వచ్చే చౌక కార్మికుల ప్రవాహాన్ని అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.సామూహిక వలసలు నిలకడలేనివని.

ఇది కష్టపడి పనిచేసే వ్యక్తుల వేతనాలను తగ్గించిందని .వారు తమ అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారని జేమ్స్ పేర్కొన్నారు.

మొత్తం వలసల సంఖ్యను తగ్గించేటప్పుడు ఆర్ధిక వ్యవస్ధకు అవసరమైన నైపుణ్యాలను కలిగివున్న ప్రకాశవంతమైన , ఉత్తమమైన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి తాము ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని హోం సెక్రటరీ( Home Secretary ) అన్నారు.తాను బ్రిటీష్ ప్రజలకు వారి ప్రయోజనాలకు ఉపయోగపడే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను అందిస్తానని వాగ్థానం చేశానని ఆయన గుర్తుచేశారు.యజమానులు, కంపెనీలు కూడా ఈ విషయంలో తమ వంతు పాత్ర పోషించాలని , బ్రిటీష్ కార్మికులకు మొదటి స్థానం ఇవ్వాలని జేమ్స్ సూచించారు.

Advertisement

ఏప్రిల్ 11న విదేశీ దరఖాస్తుదారులు తమ డిపెండెంట్‌లను ఫ్యామిలీ వీసాలపై తీసుకురావడానికి అవసరమైన కనీస ఆదాయానికి పెంపుదల కూడా అమల్లోకి వస్తుంది.ఇది 18,600 పౌండ్ల నుంచి 29,000 పౌండ్లకు పెరగనుంది.ఇకపై ఏ రంగం శాశ్వతంగా ఇమ్మిగ్రేషన్‌పై ఆధారపడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అందువల్ల నేడు .కొరత వృత్తుల జాబితాను కూడా రద్దు చేశామని హోం ఆఫీస్ పేర్కొంది.ఇండిపెండెంట్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ) సిఫారసు మేరకు రూపొందించబడిన కొత్త ఇమ్మిగ్రేషన్ జీతాల జాబితా (ఐఎస్ఎల్) కింద రెసిడెంట్ వర్క్‌ఫోర్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను పరిగణనలోనికి తీసుకుని నైపుణ్యం కొరత వున్న చోట మాత్రమే కొత్త నిబంధనలు చేర్చుతామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు