యూఏఈలో ఫ్లయింగ్ కార్ రేస్.. వరల్డ్ రికార్డు క్రియేట్..

ఫ్లయింగ్ కార్లు లేదా ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ (EVOTLs)లో ఎంచక్కా ప్రయాణం చేయాలనేది చాలా మందికి చిరకాల స్వప్నం.

ఆ కలను నెరవేర్చేందుకు ఇప్పుడు, ప్రపంచంలోని అనేక కంపెనీలు ఫ్లయింగ్ మెషిన్స్‌ అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఆల్రెడీ అన్ని కంపెనీలు వీటిని తయారుచేసి టెస్ట్ రన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాయి.ఫ్లయింగ్ కార్ల( Flying Cars ) పట్ల ఆసక్తి ఉన్న దేశాలలో ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE).

సమీప భవిష్యత్తులో ఈ కార్ల కోసం రేసును కండక్ట్ చేయాలని ఆ దేశం ఆల్రెడీ ఒక ఆలోచన కూడా చేసింది.కార్టూన్స్ లో తప్ప మనం ఇలాంటి ఫ్లయింగ్ కార్ రేస్( Flying Car Race ) రియల్ లైఫ్ లో చూసి ఉండం, అందువల్ల దీని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ రేస్ తో కారు సామర్థ్యాలను కూడా నిరూపించాలని యూఏఈ యోచిస్తోంది.ఈ రేసుతో వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ అవుతుంది.

Advertisement

ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే ఫ్లయింగ్ రేస్ కారును రూపొందించిన ఫ్రెంచ్ కంపెనీ మాకా ఫ్లైట్( Maca Flight ) ఫ్లయింగ్ కార్లపై పని చేస్తున్న కంపెనీలలో ఒకటి.మాకా ఫ్లైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ పినో ప్రకారం, ఫ్లయింగ్ కార్ రేస్ సాధ్యమవుతుంది, 2025 చివరి నాటికి అది జరగవచ్చు.మొదటి రేసుకు యూఏఈ సరైన ప్రదేశం కాగలదని ఆయన అన్నారు.10 మంది వరకు రేసర్లు పాల్గొనవచ్చు.ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ వంటి ఇతర దేశాలు కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిని వ్యక్తం చేశాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఫ్లయింగ్ కార్లు చాలా ఖరీదైనవి.మాకా ఫ్లైట్ కంపెనీ తయారుచేసిన ఫ్లయింగ్ రేస్ కారు ధర రెండు మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా, ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రేసింగ్ కారు అయిన ఫార్ములా వన్ కారు కంటే చాలా ఎక్కువ.కానీ ఫ్లయింగ్ రేస్ కారులో 250 కిమీ వేగం, భూమి నుండి ఐదు మీటర్ల ఎత్తులో ఎగిరే ఎత్తు వంటి కొన్ని ఆకట్టుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు