చెన్నైలో దారుణం మద్యంలో విషం ఇద్దరు మృతి..!!

ఆదివారం చెన్నైలో( Chennai ) తంజావూరు లో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ అవుట్ లెట్ సమీపంలో ఓ బార్ లో మద్యం సేవించి( Alcohol ) ఇద్దరు వ్యక్తులు మరణించారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆ మద్యం షాపుపై దాడి చేసి ఆందోళన నిర్వహించారు.

దీంతో తంజావూరు కలెక్టర్ దినేష్ పొనరాజ్ ఆలివర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విలేకరులతో మాట్లాడుతూ.సైనైడ్ విష ప్రయోగం జరిగిందనే అనుమానం ఉందని పేర్కొన్నారు.

కాగా మృతులు మద్యం తాగిన కొద్ది క్షణాలకే స్పృహ తప్పి పడిపోయినట్లు అక్కడున్న వాళ్లు తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యలోనే ఇద్దరు మరణించడంతో.వారు సేవించిన మద్యంలో.

సైనైడ్ ద్రవానికి సంబంధించిన జాడలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇదే సమయంలో మృతుల పోస్టుమార్టం రిపోర్టులో కూడా షాకింగ్ విషయాలు వెళ్లడయ్యాయి.

Advertisement

మద్యంలో విషం కలపటంతోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.దీంతో విషం ఎవరు కలిపారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling
Advertisement