Twitter user suggests Rashmi to learn classes from Anasuya

ఈమధ్యకాలంలో రష్మీ హవా కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తోంది కాని, ఫామ్ లో ఉన్నప్పుడు రష్మీ టీవి ప్రపంచాన్ని ఓ ఊపిందన్న మాటను మనం కాదనలేం.

టీవి యాంకరింగ్ కి గ్లామర్ అద్దిన భామల లిస్టులో రష్మీ పేరు టాప్ లో ఉంటుంది.

టీవిలో రష్మీ గ్లామర్ షో, వెండి తెరపై తను వడ్డించే అందాల విందు వలన, రష్మీ అంటే కేవలం ఒక గ్లామర్ డాల్, అంతకుమించి ఏమి కాదు అని అనుకుంటారు చాలామంది.
కాని ఆమెని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారికి తెలిసు ఆమె సామాజిక ఆంశాలపై కూడా మాట్లాడుతుందని, ఆమెకి అలాంటి ప్రపంచ జ్ఞానం ఉందని.

Twitter User Suggests Rashmi To Learn Classes From Anasuya-Twitter User Suggests

అయితే రష్మీ ఏదైనా విషయం మీద స్పందిస్తే దాన్ని ఓవర్ యాక్షన్ అంటున్నారు కొంతమంది.ఆ ఓవర్ యాక్షన్ కామెంట్స్ మీద ఘాటుగానే స్పందించింది రష్మీ.


ఎవరో మహానుభావుడు ఓ పెద్ద జిరాఫీని చంపాడు.అంతటితో ఆగకుండా, ఆ జిరాఫీతోనే ఫోటో దిగి సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేసాడు.

Advertisement

బాగా వైరల్ వెళ్ళిన ఆ ఫోటో, అటు తిరిగి ఇటు తిరిగి మన రష్మీ దాకా వచ్చింది.దాంతో రష్మీ మనుషులుగా మన ఎదుగుదల మీద క్లాస్ పీకినట్టుగా ఓ ట్వీట్ వేసింది.


ఆ ట్విట్ రప్లైగా ఎవరో యూజర్ "పనికిరాని విషయాలన్నీటి మీద ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తావ్ .ముందు వెళ్ళి అనసూయ దగ్గర క్లాసులు విని యాంకరింగ్ నేర్చుకో" అంటూ కామెంట్ చేసాడు.దానికి రష్మీ గమ్మున ఉండకుడా "అలాగేనండి.

గుర్తుపెట్టుకుంటాను.అనసూయ నాకు పాఠాలు ఎప్పుడు చెబుతావ్" అంటూ సెటైర్ వేసింది.

మరి దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు