విషాదం.. వారి దాడుల్లో టీవీ నటి, టిక్ టాక్ స్టార్ మృతి!

తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.బుధవారం రాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడ్డారు.

ఈ క్రమంలోనే టీవీ నటి ని కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది.అంతేకాకుండా ఈ ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.బూదగామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.తీవ్ర గాయాలు అయిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

అయితే ఈ ఘటనలో ఆమెతో పాటుగా ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్ జుబీర్ కు కూడా గాయం అయినట్లు పోలీసులు తెలిపారు.అయితే బాలుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ దాడులను నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఈ ఘటన మరువకముందే 24 గంటల వ్యవధిలోనే కాశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ దాడుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు.అయితే నటి అమ్రీన్ భట్ మృతి విషయం తెలుసుకున్న ఆమె తోటి నటీనటులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

ఈ రెండు ఘటనలతో స్థానికంగా ఉండే ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు.అంతేకాకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

Advertisement

ఈ రెండు ఘటనతో పోలీసు సిబ్బంది కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు