ఎండ‌ల‌ దెబ్బ‌కు చ‌ర్మం పొడిబారిందా.. పుచ్చ‌కాయ‌తో రిపేర్ చేసుకోండిలా!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్( Summer season ) లో విరివిగా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌లో పుచ్చ‌కాయ ఒక‌టి.

పిల్ల‌లే కాదు పెద్ద‌లు కూడా పుచ్చ‌కాయ‌ను( Watermelon ) ఎంతో ఇష్టంగా తింటుంటారు.

పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉండ‌టం వ‌ల్ల‌ బాడీని హైడ్రేట్‌గా ఉంచ‌డంలో, హీట్ స్ట్రోక్ బారిన ప‌డ‌కుండా ర‌క్షించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌పడుతుంది.అలాగే చ‌ర్మ ఆరోగ్యాన్ని కూడా పుచ్చ‌కాయ ప్రోత్స‌హిస్తుంది.

ముఖ్యంగా ఎండ‌ల దెబ్బ‌కు పొడిబారిన చ‌ర్మాన్ని పుచ్చ‌కాయతో ఈజీగా రిపేర్ చేసుకోవ‌చ్చు.

Try This Watermelon Mask For Repairing Dry And Damaged Skin Dry Skin, Damaged S

అందుకోసం మిక్సీ జార్ లో గింజ తొల‌గించిన కొన్ని పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను ( Watermelon slices )మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పుచ్చ‌కాయ పేస్ట్ లో వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్( Aloe vera gel ), వ‌న్ టీ స్పూన్ తేనె( honey ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని ఆర‌బెట్టుకోవాలి.

Advertisement
Try This Watermelon Mask For Repairing Dry And Damaged Skin! Dry Skin, Damaged S

పూర్తిగా డ్రై అయ్యాక వాట‌ర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించ‌డం వ‌ల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.

చర్మం ఫ్రెష్‌గా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.మొటిమలు, చర్మంపై ఉన్న అదనపు నూనె తగ్గించడానికి మ‌రియు చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా మెరిపించ‌డానికి కూడా ఈ రెమెడీ స‌హాయ‌ప‌డుతుంది.

Try This Watermelon Mask For Repairing Dry And Damaged Skin Dry Skin, Damaged S

అలాగే స‌మ్మ‌ర్ లో చాలా కామ‌న్ గా వేధించే స‌మ‌స్య స‌న్ టాన్‌.అయితే టాన్ ను తొల‌గించుకునేందుకు ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బాదం పౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్లు పుచ్చ‌కాయ పేస్ట్ మ‌రియు వ‌న్ టేబుల్ స్పూన్ పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి ప‌దిహేను నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

ఆపై సున్నితంగా చ‌ర్మాన్ని స్క్ర‌బ్బింగ్ చేసుకుంటూ వాట‌ర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేశారంటే టాన్ మొత్తం రిమూవ్ అవుతుంది.

వారానికి 2 సార్లు ఈ చిట్కాను పాటిస్తే అండర్ ఆర్మ్స్ వైట్ గా మారడం గ్యారెంటీ!
నటి పవిత్ర లోకేష్ తండ్రి భర్త కూడా టాప్ స్టార్స్ అని మీకు తెలుసా ..?

చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాలు తొల‌గిపోతాయి.చ‌ర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు