ఏదైనా పెళ్లికి వెళ్ల‌బోతున్నారా? ఈ చిట్కాను ట్రై చేస్తే స‌హ‌జంగానే మెరిసిపోతారు!

ఆషాఢ మాసం వెళ్లి శ్రావ‌ణ మాసం వ‌చ్చింది.శ్రావ‌ణ మాస‌మంటే పండగలు, పేరంటాలు, నోములే కాదు.

పెళ్లిళ్లు కూడా ఎక్కువ‌గానే జ‌రుగుతుంటాయి.ఈ పెళ్లిళ్ల సీజ‌న్‌లో చ‌ర్మాన్ని చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి.

ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా.సౌంద‌ర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

దాంతో పెళ్లికి వెళ్లాల‌న్న మూడు, ఉత్సాహం రెండు ఆవిరి అయిపోతాయి.అందుకే ఏదైనా పెళ్లికి వెళ్లాల‌నుకుంటే ముందు నుండీ స్కిన్ విష‌యంలో కేర్ తీసుకోవాలి.

Advertisement
Try This Tip And Youll Glow Naturally Details! Natural Glow, Skin Care, Skin Car

మీరు ఏదైనా పెళ్లికి వెళ్ల‌బోతున్నారా.? అక్క‌డ‌ మీరే స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అవ్వాల‌నుందా.? అయితే డోంట్ వ‌ర్రీ.ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను ట్రై చేస్తే సహ‌జంగానే మీ చ‌ర్మం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోతుంది.

మ‌రి లేటెందుకు ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పొట్టు పెస‌ర‌ప‌ప్పు, వ‌న్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిప‌ప్పు వేసుకుని మెత్త‌టి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ లెమ‌న్ పీల్ పౌడ‌ర్‌, చిటికెడు పసుపు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

Try This Tip And Youll Glow Naturally Details Natural Glow, Skin Care, Skin Car

చివ‌రిగా అందులో మూడు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు ప్యూరీ, ఐదారు టేబుల్ స్పూన్ల పాలు వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్‌ చేసుకుని.ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా సీర‌మ్‌ను అప్లై చేసుకోవాలి.

Advertisement

పెళ్లికి వారం రోజులు ముందు నుండీ ఈ చిట్కాను పాటిస్తే.ముఖంలో స‌హ‌జ మెరుపు సంత‌రించుకుని అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

తాజా వార్తలు