Sore Throat : గొంతు నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతుందా.. ఈ రెండు పదార్థాలతో ఈజీగా చెక్ పెట్టండి!

గొంతు నొప్పి( Sore throat ).పిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

అయితే గొంతు నొప్పికి ఒకే రకమైన కారణాలు ఉండవు.ఫ్లూ, సాధారణ జలుబు, చికెన్‌ పాక్స్, మోనోన్యూక్లియోసిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో వచ్చే మార్పులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కాలుష్యం, పొగ, ధూళికి ఎక్కువగా గురికావడం తదితర కారణాల వల్ల గొంతు నొప్పికి గురవుతుంటారు.

ఇది చిన్న సమస్య గానే కనిపించిన తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.గొంతు నొప్పి వల్ల ఆహార పానీయాలు మింగడం లో కష్టంగా అనిపిస్తుంది.

మాట్లాడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే గొంతు నొప్పి ని తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా గొంతు నొప్పిని నివారించుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే సులభంగా గొంతు నొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.స్టవ్ ఆఫ్ చేసే ముందు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ డ్రింక్ రోజుకు ఒకసారి వేడివేడిగా కనుక తీసుకుంటే గొంతు నొప్పి దెబ్బ‌కు ప‌రార్ అవుతుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

మిరియాలు బెల్లం లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) గొంతు నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తాయి.జలుబు, దగ్గు ( Cold, cough )వంటి సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి.కాబట్టి గొంతు నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.

Advertisement

అలాగే కారం, పులుపు, మసాలా అధికంగా ఉన్న ఆహారాలను ఎవైడ్ చేయండి.ధుమపానం మరియు గుట్కా వంటి అల‌వాట్ల‌ను మానుకోవాలి.ఫ్రిజ్‌లోని నీళ్లు మరియు చల్లటి పానీయాల జోలికి వెళ్ల‌కుండా ఉండాలి.

తద్వారా గొంతు నొప్పి చాలా వేగంగా తగ్గుముఖం పడుతుంది.

తాజా వార్తలు