ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!

కొందరికి జుట్టు అనేది చాలా పల్చగా ఉంటుంది.హెయిర్ ఫాల్( Hair Fall ) ఇందుకు ఒక కారణమైతే.

హెయిర్ గ్రోత్ లేకపోవడం మరొక కారణం.అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే న్యాచురల్ టానిక్ ఒకటి ఉంది.

ఆ టానిక్ ఏంటి.? దాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) ఒక గ్రీన్ టీ బ్యాగ్( Green Tea Bag ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో థిక్ గా మారిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,( Olive Oil ) వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్ గా అనేది సిద్ధం అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

టానిక్ అప్లై చేసుకున్న 45 నిమిషాలు లేదా గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఈ హోమ్ మేడ్ టానిక్ ను వాడటం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.అలాగే ఈ టానిక్ తయారీలో వాడిన అవిసె గింజలు, గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ ఇవన్నీ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.

జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.కురులు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తాయి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడారంటే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

పైగా ఈ టానిక్ ను ఉప‌యోగించ‌డం వల్ల హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది.జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.

Advertisement

మరియు పొడి జుట్టు సమస్య సైతం దూరం అవుతుంది.

తాజా వార్తలు