టీఆర్ఎస్ రెండుగా చీలిందా ? కారణం అదేనా ?

ఎక్కడ నెగ్గాలోకాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే గొప్పవాడు అవుతాడు.

ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఆ తరువాత వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం ఎవరి వల్లా కాదు.

ఇప్పుడు అదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్వయించి విమర్శలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది.తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో ఇంటా బయటా కేసీఆర్ తీవ్రమైన తలొనొప్పులు ఎదుర్కొంటున్నాడు.

పద్నాలుగు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉదృతం అవుతూనే ఉంది.ఈ విషయంలో కోర్టు కూడా జోక్యం చేసుకుని ఇరువురు చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకోవాలని సూచించినా ఏ ఒక్కరు ముందుకు అడుగులు వేయడంలేదు.

Trs Party Dived In Two Parts What Is The Reason

  సమ్మె చేపట్టిన మొదటి రెండు మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికులపై ప్రజలు ఆగ్రహం వ్యర్థం చేసి ప్రభుత్వ తీరుని సమర్ధించినా ఆ తరువాత తమ వాదనను ఆర్టీసీ ఉద్యోగుల సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.ఇక అప్పటి నుంచి సమ్మెకు కారణం సీఎం కేసీఆర్, ఆయన అహంకారం అని తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన భావన ఏర్పడిపోయింది.ఇప్పుడు ఇదే అంశం అధికార టీఆర్ఎస్ పార్టీని రెండు ముక్కలు అయ్యేలా చేసినట్టు కనిపిస్తోంది.

Advertisement
Trs Party Dived In Two Parts What Is The Reason-టీఆర్ఎస్ రె

పైకి కనిపించకపోయినా ఇప్పుడు టీఆర్ఎస్ లో యూటీ (ఉద్యమ బ్యాచ్) బీటీ (బంగారు తెలంగాణ ) బ్యాచ్ లుగా విడిపోయినట్టు సమాచారం.ఉద్యమం నాటి నుంచి పార్టీలో ఉన్న వారంతా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో కేసీఆర్ తప్పు చేస్తున్నారన్న భావనతో ఉండగా, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నేతలు మాత్రం సీఎం కేసీఆర్ సరైన రూట్లోనే వెళ్తున్నారంటూ వెనకేసుకొచ్చారు.

Trs Party Dived In Two Parts What Is The Reason

  ఆర్టీసీ కార్మికుల బ్లాక్ మొయిల్ కు కేసీఆర్ లొంగాలా అని ప్రశ్నించారు.దీనికి నిదర్శనంగా ఆ పార్టీ నేత ముత్తురెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక తమ పార్టీ నేతలే ఉన్నారని ప్రకటించి సంచలనం రేపారు.ఆర్టీసీ సమ్మె పార్టీలో చీలిక తెచ్చిందని కొంతమంది పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

ఈ విషయంలో కేసీఆర్ తొందరగా మేల్కొని ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీ నాయకులే ఆందోళన చెందుతున్నారు.

తాజా వార్తలు