MLC Kavitha CBI: నా పేరెక్కడ :  సీబీఐ కి లాజిక్ గా రిప్లై పంపిన కవిత ! 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనమే రేపిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరుతో పాటు, కవిత పేరు తెరపైకి వచ్చింది.

ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుండగా నే  సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది.సిబిఐ విచారణకు సహకరించాలని నోటీసులు పంపింది.

అయితే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం కేంద్ర అధికార పార్టీ బిజెపి కుట్రని,  తెలంగాణలో తమను ఎదుర్కోలేకే ఈ విధంగా కేసుల్లో ఇరికించి ఈడి, ఐటీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించాయని , తనను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి జైలుకు వెళ్తా అంటూ కవిత అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు.ఇక సిబిఐ తనకు ఇచ్చిన నోటీసులు పైన స్పందించారు.

తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని,  దర్యాప్తుకు సహకరిస్తానని,  ఈ నెల 6 న తన నివాసంలో సిబిఐ అధికారులు తనను విచారించి వివరణ తీసుకోవచ్చని ఆమె గతంలోనే ప్రకటించారు.అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న కొన్ని కార్యక్రమాలు ఉన్నందున ఆరో తేదీన కుదరదని,  ఈనెల 11 ,12, 14, 15వ తేదీల్లో ఏదో ఒక అనువైన తేదీన తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు.

Advertisement

అయితే గత రెండు రోజులుగా కవిత కెసిఆర్ తో సమావేశం అవుతున్నారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి న్యాయ నిపుణులతోనూ చర్చించారు .మొదట ఫిర్యాదు కాఫీ , ఎఫ్ఐఆర్ కావాలని సిబిఐ కు లేఖ రాశారు.దీనిపై సిబిఐ నుంచి  సమాధానం వచ్చింది.

ఫిర్యాదు కాఫీ,  ఎఫ్ఐఆర్ సిబిఐ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని సమాచారం వచ్చింది.

వీటిని క్షుణ్ణంగా న్యాయ నిపుణుల ద్వారా పరిశీలించిన కవిత వాటిల్లో తన పేరు లేదని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా లేఖలో పేర్కొన్నారు.ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని ఆమె క్లారిటీకి వచ్చారు.

సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను.మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను.దానిలో నా పేరు ఎక్కడా లేదు.

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అంటూ సిబిఐకి ఆమె వర్తమానం పంపించారు.అయితే కవిత తెలివిగా సీబీఐ కి సమాధానం ఇవ్వడం తో, ఆమె మొదట్లో సీబీఐ కి సహకరిస్తాని చెప్పినా, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు గా కనిపిస్తున్నారు.

Advertisement

 .

తాజా వార్తలు