సారీ చెప్పిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి..!!

ప్రజాస్వామ్యం లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి.ఇష్టానుసారంగా మాటలు వెళితే సమాజంలో అనేక ఇబ్బందులు కొన్ని తెచ్చినట్లు అవుతుంది.

ఈ రీతిగానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇటీవల కొన్ని సామాజిక వర్గాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.చిన్న కులాలు అంటూ ఇష్టానుసారం అయిన కామెంట్ చేయడంతో ఆయనపై తీవ్రస్థాయిలో సొంత పార్టీ నేతల నుండి కూడా విమర్శలు రావడం జరిగాయి.

ఈ క్రమంలో సదరు కులాలకు క్షమాపణలు చెప్పిన ధర్మారెడ్డి తాజాగా పార్టీ నేతలకు కూడా సారీ చెప్పినట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల ఓసీ జేఏసీ సభలో పాల్గొన్న ధర్మారెడ్డి .చిన్న కులాలకు చెందిన వారికి అక్షరం ముక్క రాదు అని, కానీ వాళ్లంతా ఆఫీసర్ స్థానంలో కూర్చుంటూ వ్యవస్థలను నాశనం చేస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది.దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి.

వరంగల్ జిల్లావ్యాప్తంగా సోమవారం ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి.దెబ్బకి ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు.

Advertisement
Trs Mla Dharmareddy Apologizes On His Words, Trs,parakala,dharma Reddy,warangal-

కావాలని ఎవరిని ఉద్దేశించి కావున ఈ మాటలు అనలేదని క్షమాపణలు తెలిపారు.ఇదే క్రమంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అసహనం వ్యక్తం చేయడంతో వాళ్లకి కూడా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పినట్లు అంతర్గతంగా పార్టీలో వినబడుతున్న టాక్.

Trs Mla Dharmareddy Apologizes On His Words, Trs,parakala,dharma Reddy,warangal
Advertisement

తాజా వార్తలు