నన్ను విమర్శిస్తే ... నోట్లో పురుగులు పడతాయ్ !

తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ దక్కకపోవడం తో టీఆర్ఎస్ గూటికి చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.

నన్ను విమర్శించే వారి నోట్లో పురుగులు పడతాయి అంటూ.

శాపనార్ధాలు పెట్టారు.టికెట్ ఇస్తాను అని చెప్పి నాలుగేళ్లపాటు నన్ను తిప్పుకుని నా టికెట్ కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు .

కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ముత్యంరెడ్డి.దుబ్బాక సీటు కోసం ప్రయత్నించగా .నిరాశే ఎదురయ్యింది.ఆ తర్వాత హరీష్‌రావు చర్చలతో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ముత్యంరెడ్డి అమ్ముడు పోయారంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించడంపై పై విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement